: ఎప్పుడో కాదు...ఇప్పుడేం చేస్తున్నారు?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చెరుకు సుధాకర్
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో అద్భుతాలు చేసేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోందని...ఇప్పుడు మాత్రం కళ్లు మూసుకుని ఉందని టీఆర్ఎస్ మాజీ నేత డా. చెరుకు సుధాకర్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే సెటిలర్ల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తామని చెబుతున్నారని...సంక్రాంతి పండగకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సులు వేలకు వేల రూపాయలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ఆయన నిలదీశారు. మధ్యతరగతి ప్రజలే సొంత ఊర్లకు వెళ్తున్నారని, వారు నిలువు దోపిడీకి గురవుతుంటే టీఆర్ఎస్ నేతలు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి టీఆర్ఎస్ నేతలు రేపు గ్రేటర్ పగ్గాలు చేపట్టి ప్రజలకు ఏం చేస్తారని ఆయన నిలదీశారు.