: ఖాకీలతో టీమిండియా బౌలర్ తమ్ముడి ఫైటింగ్... పోలీసు చొక్కా చించిన వైనం


టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సోదరుడు పోలీసులతో ఫైటింగ్ చేశాడు. తన వర్గానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను నిలువరించిన షమీ సోదరుడు మహమ్మద్ హసీబ్, వారితో వాగ్వాదానికి దిగడమే కాక, దాడికి కూడా దిగాడు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి చొక్కా కూడా చిరిగింది. దీంతో పోలీసులు హసీబ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వివరాల్లోకెళితే... మహమ్మద్ షమీ సొంతూరు అమ్రోహలో గోవధ జరుగుతోందన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని విచారించేందుకు పోలీసులు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న హసీబ్... అక్కడికి వెళ్లి గోవధ, గోవుల అక్రమ తరలింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వదిలిపెట్టాలని పోలీసులతో వాదనకు దిగాడు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేశాడు. హసీబ్ ను నిలువరించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉండగా, సదరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మరికొందరు నిందితులతో కలిసి పరారయ్యాడు. హసీబ్ దాడిలో ఓ పోలీసు అధికారి చొక్కా కూడా చిరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు హసీబ్, అతడి మిత్ర బృందంపై కేసు నమోదు చేయడమే కాక, వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News