: అంతా అయోమయం... మసూద్ అజర్ అరెస్ట్ అయినట్టా? కానట్టా?


కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు, పఠాన్ కోట్ ఉగ్రదాడితో పాటు ఇండియాపై పలు మార్లు జరిగిన ఉగ్రదాడుల వెనక సూత్రధారిగా భావిస్తున్న మౌలానా మసూద్ అజర్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారని వచ్చిన వార్తలపై అనుమానాలు పెరుగుతున్నాయి. మసూద్ తో పాటు ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పాక్ మీడియా ప్రకటించగా, అటువంటి సమాచారమేదీ అధికారికంగా రాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ప్రకటించారు. మరోవైపు పాక్ లోని భారత దౌత్యాధికారులు సైతం మసూద్ అరెస్ట్ పై తమకు సమాచారం లేదని స్పష్టం చేయగా, పాకిస్థాన్ మంత్రి మహమ్మద్ జుబేర్ కూడా మసూద్ విషయమై తనకు ఏమీ తెలియదని చెపమ్పారు. దీంతో అసలు మసూద్ అరెస్ట్ జరిగిందా? లేదా? అన్న విషయంమై పలు అనుమానాలు, అయోమయం నెలకొంది.

  • Loading...

More Telugu News