: పాక్ క్రికెట్లో సంక్షోభం... సీనియర్ల మూకుమ్మడి రిటైర్మెంట్!
మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసీఎల్) లో ఆడాలనుకొంటున్న పలువురు ఆటగాళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ప్రకటించగా, ఆ వెంటనే సీనియర్లు తమ మూకుమ్మడి రిటైర్ మెంటును ప్రకటించారు. అబ్దుల్ రజాక్, మొహమ్మద్ యూసుఫ్, ఇమ్రాన్ ఫర్హత్, తాఫీక్ ఉమర్, యాసిర్ హమీద్ తదితరులు ఆ వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడంతో పాక్ క్రికెట్ సంక్షోభంలో పడ్డట్టయింది. ఆటగాళ్లు తక్షణం అధికారిక క్రికెట్ కు దూరమవుతున్నామని ప్రకటిస్తేనే, ఎంసీఎల్ లో ఆడవచ్చని పీసీబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కన్నా ఎంసీఎల్ లో ఆడితే, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని భావిస్తున్న క్రికెటర్లు వెంటనే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.