: పశువులకు ఇటువంటి ఆహారమా.... ప్రజలు తాగేవి ప్రమాదకరమైన పాలా?
రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ శివార్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కంపుకొట్టే మాంసాహార వ్యర్థాలు, సాంబారును పశువులకు ఆహారంగా ఇస్తూ, వాటి పాలను ప్రజలకు అంటగట్టడంపై పశుసంవర్థక శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు పశుసంవర్థక శాఖ ఆదేశాలు జరీచేసింది. కాగా ఇటువంటి పాలు తాగిన వారు అనారోగ్యం బారినపడుతున్నారంటూ, దీనిని సుమోటోగా గుర్తించాలని బాలల హక్కుల కమిషన్ ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు, హోటళ్ల నుండి వ్యర్థాలను తరలించే ఏజెంట్లు, ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్న హోటళ్లపై చర్యలు తీసుకునేందుకు నడుం బిగించారు.