: షారూఖ్ సూపర్ స్టార్ అయినా క్లాస్ బయటే నిల్చునేవాడు!: డ్యాన్స్ మాస్టర్ షిమాక్ దావర్


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నిజమైన సూపర్ స్టార్ అని డ్యాన్స్ మాస్టర్ షిమాక్ దావర్ తెలిపాడు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాలుపంచుకునే తారలకు నృత్య రీతులు సమకూర్చుతున్న సందర్భంగా షిమాక్ దావర్ అభిమానులతో గతస్మృతులు నెమరువేసుకున్నాడు. గతంలో షారూఖ్ భార్య గౌరీ ఖాన్ తన వద్ద డాన్స్ నేర్చుకునేందుకు వచ్చేవారని, అప్పుడు ఆమె డాన్స్ క్లాస్ పూర్తయ్యేంతవరకు షారూఖ్ క్లాస్ బయట వేచి ఉండేవాడని ఆయన చెప్పాడు. అంతపెద్ద హీరో అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడని షిమాక్ చెప్పాడు. ఈ సందర్భంగా షారూఖ్ తో ప్రాక్టీస్ అనంతరం తీసుకున్న ఫోటోను ఆయన పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News