: టికెట్లు ఇచ్చేశారు... ట్రైన్ లు మాత్రం లేవు...సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికుల అగచాట్లు!


హైదరాబాదు నుంచి స్వస్థలాలకు తరలుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాతిని పురస్కరించుకుని ప్రయాణికులు స్వస్థలాలకు పెద్దసంఖ్యలో బయల్దేరారు. దీంతో హైదరాబాదులోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాదు నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అడిగిన ప్రయాణికులందరికీ టికెట్లు జారీ చేయడంతో ట్రైన్లు ఎక్కే క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. సికింద్రాబాదు రైల్వేస్టేషన్ లో పలు రైళ్ల వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంటోంది. నాలుగు రైళ్లకు సరిపడా ప్రయాణికులకు టికెట్లు జారీ చేసిన రైల్వే శాఖ, ఒకే ట్రైన్ తో నెట్టుకొస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. స్పెషల్ ట్రైన్ వేయాలంటూ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News