: కేంద్ర మంత్రికే పర్మిషన్ ఇవ్వని పశ్చిమబెంగాల్ సర్కార్!


ఈ నెల 18న పశ్చిమబెంగాల్ లో బీజేపీ నిర్వహించనున్న ఒక ర్యాలీలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. పశ్చిమబెంగాల్ లోని మాల్దా జిల్లాలోని కాళియచాక్ ప్రాంతంలో తరచుగా అల్లర్లు జరుగుతుంటాయి. ఇక్కడ నిర్వహించనున్న ఒక ర్యాలీలో పాల్గొనేందుకు అనుమతించాలని ఆయన మమతా సర్కార్ ను కోరారు. శాంతిభద్రతల నేపథ్యంలో ఆయన పర్యటించేందుకు జిల్లా అధికారులు అనుమతించలేదు. ఇదిలావుంటే, మరోపక్క ఈ నెల 21వ తేదీన కాళియచాక్ లో నిర్వహించనున్న ఒక ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News