: హిందూపురంలో 'డిక్టేటర్' టికెట్ల వేలం పాట... రూ.13,500లకు అమ్ముడైన తొలి టికెట్


ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో 'డిక్టేటర్' సందడి మొదలైంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుండటంతో బాలయ్య అభిమానులు ఈ చిత్రం టికెట్లకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో మొదటి టికెట్ ను ఆలిండియా నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు నంబూరి సతీష్ రూ.13,500లకు కొనుక్కున్నారు. రెండో టికెట్ ను నందమూరి ఫ్యాన్స్ హిందూపురం టౌన్ అధ్యక్షుడు బండారు బాలాజీ- రూ.13,000లకు, మూడో టికెట్ ను కిరికెర సర్పంచ్ హెచ్.ఎన్ రాము- రూ.10,116 లకు దక్కించుకున్నారు. ఈ టికెట్ల ద్వారా వచ్చిన డబ్బును బాలకృష్ణ పేరు మీద సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News