: నెల్లూరులో అతిపురాతన బుద్ధ విగ్రహాలు స్వాధీనం


నెల్లూరులో అతిపురాతన రూబీ రాతి బుద్ధ విగ్రహాలను దొంగల ముఠా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బద్ధుని విగ్రహాల విలువ రూ.కోట్లలో ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పండితి వెంకటేశ్, చిలుకూరి శ్యాంకుమార్, రామస్వామి సుబ్రమణ్యం అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా ఆలయాల్లోని పురతాన విగ్రహాలను ఎత్తుకెళుతున్నారు. వారిపై ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేయడంతో తాజాగా ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించడంతో ఈ దొంగతనాలను అంగీకరించారు. వారి నుంచి ఈ బుద్ధ విగ్రహాలను, దేవతా విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. 2014లో బాలాజీనగర్ లక్ష్మీకాంతమ్మ ఆశ్రమంలో ఆ విగ్రహాలు దోపిడీకి గురైనట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News