: తాత్కాలిక సచివాలయం వెలగపూడిలోనే... రేపు టెండర్లను ఆహ్వానించనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని వెలగపూడిలోనే ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలో భూసార పరీక్షల నివేదికలు వచ్చాయని, సర్వే నంబర్ 205, 206, 207, 208, 214లో సచివాలయ నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండంతస్తులలో సచివాలయం నిర్మించనున్నామని వివరించారు. మంత్రివర్గ ఉపసంఘంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిర్మాణానికి సంబంధించి రూ.180 కోట్లతో రేపు టెండర్లను ఆహ్వానించనున్నట్టు పేర్కొన్నారు.