: 'పఠాన్ కోట్' దాడి బాధ్యులపై పాక్ చర్యలు... పలువురు జైష్-ఏ-మహ్మద్ నేతల అరెస్టు
పఠాన్ కోట్ ఉగ్రదాడి బాధ్యులపై పొరుగుదేశం పాకిస్థాన్ చర్యలు ప్రారంభించింది. ఇందుకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి దర్యాప్తు బృందం, ఆ దేశంలోని జైష్-ఏ-మహ్మద్ సంస్థ కార్యాలయాన్ని మూసివేసింది. పఠాన్ కోట్ దాడిలో ఈ సంస్థ హస్తం ఉందని ఇప్పటికే నిర్థారించడంతో, పలువురు జైష్-ఏ-మహ్మద్ నేతలను అరెస్టు చేశారు. అయితే ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కోసం విచారణాధికారులను పాక్ భారత్ కు పంపనుంది.