: 'డిక్టేటర్'లో అన్నీ సూపరే!: బాలకృష్ణ
డిక్టేటర్ సినిమాలో అన్నీ సూపరేనని అగ్రహీరో బాలకృష్ణ అన్నారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. డిక్టేటర్ చిత్రం కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం... ఇలా ప్రతి అంశం బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు. మంచి పండగ.. పండగకి మంచి సినిమా ఈ డిక్టేటర్ అని చెప్పారు. సినిమాలకు టైటిల్స్ ఏ విధంగా సెలక్టు చేసుకుంటారనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. తన ప్రతి సినిమా టైటిల్ కు ఒక చరిత్ర ఉందని అన్నారు. తన చిత్రాల టైటిళ్లలో పవర్ ఉంటుందని బాలకృష్ణ చెప్పారు.