: గాంధీభవన్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ... గెలుపే లక్ష్యంగా చర్చలు
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీల్ అలీ, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, దానం నాగేందర్, విహెచ్ తదితరులు హాజరయ్యారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఏలా గెలవాలి? అన్న అంశాలపై చర్చిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను దక్కించుకున్న ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ నేతలు... గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు.