: హైదరాబాదీలంతా తెలంగాణ వారే... సెటిలర్స్ అంటూ ఎవరూ లేరు: రేవంత్ రెడ్డి


జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి సెటిలర్ పదం తెరపైకి వచ్చింది. దానిపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాదీలంతా తెలంగాణ వారేనని, సెటిలర్స్ అంటూ ఎవరూ లేరన్నారు. కోదండరాం, విమలక్క, గద్దర్ లను సైతం సెటిలర్లను చేసింది టీఆర్ ఎస్సేనని చెప్పారు. అసలు సెటిలర్ అనే పదాన్ని నిషేధించాలని రేవంత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో టీడబ్ల్యూయేజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈ మేరకు రేవంత్ మాట్లాడారు. తాము కూడా సెటిలర్లమని చెబుతూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. కేసీఆర్ ఎర్రవల్లికే సీఎంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News