: రూ. 11,250కి స్నాప్ డ్రాగెన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 64 జీబీ మెమొరీ, 21 ఎంపీ కెమెరా... 20న విడుదల!
చైనాకు చెందిన మరో సంస్థ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ నెల 20న వస్తోంది. లీటీవీ సంస్థ భారత మార్కెట్లో తన తొలి స్మార్ట్ ఫోన్ 'లీ మ్యాక్స్', 'లీ 1ఎస్'లను ఆవిష్కరించనుంది. గ్రాండ్ గా జరిగే ఈ కార్యక్రమానికి మీడియాకు ఆహ్వానాలు అందాయి. గత సంవత్సరం ఏప్రిల్ లో చైనాలో విడుదలైన లీ మ్యాక్స్ ధర భారత కరెన్సీలో రూ. 11,250 మాత్రమే. 6.33 అంగుళాల క్యూహెచ్డీ స్క్రీన్, 4 జీబీ రామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 2 జీహెచ్ స్నాప్ డ్రాగన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 21/4 మెగాపిక్సల్ కెమెరాలు ఈ ఫోన్ సొంతం, వీటితో పాటు వెనుకవైపున ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనపు ఆకర్షణ. రూ. 50 వేలకు పైగా పెట్టి కొనే యాపిల్ ఫోన్ల కన్నా ఈ ఫోన్ ఫీచర్లు అద్భుతమని ఇప్పటికే నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు. 3,400 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఇతర స్మార్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కంపాస్, 4జీ, గ్రావిటీ, లైట్ సెన్సార్లు తదితర సౌకర్యాలున్నాయి.