: హృతిక్ బర్త్ డేలో మ్యూజిక్ హోరు... హోటల్ కు రూ.25 వేల జరిమానా
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మొన్న శనివారం 42వ బర్త్ డే జరుపుకున్నాడు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా హాజరైన అతడి బర్త్ డే వేడుక గానా బజానాతో హోరెత్తిపోయింది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన ‘ఫోర్ సీజన్’ హోటల్ లో తన మిత్రులకు హృతిక్ పెద్ద పార్టీనే ఇచ్చాడు. శనివారం రాత్రి మొదలైన ఈ పార్టీ ఆదివారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కొనసాగిందట. పార్టీలో హోరెత్తిన మ్యూజిక్ తో చిర్రెత్తుకొచ్చిన హోటల్ కు సమీపంలోని ఓ వ్యక్తి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సదరు హోటల్ పై కేవలం రూ.25 వేల జరిమానా వసూలు చేసి సరిపెట్టేశారు. హోటల్ మేనేజర్ ను రెండుసార్లు హెచ్చరించడం వల్ల ఆ పార్టీ ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ముగిసిందట.