: ఫిబ్రవరి 4న ఫ్రెండ్స్ డేగా జరుపుకోవాలి : ఫేస్ బుక్ సీఈఓ


ఫిబ్రవరి 4వ తేదీని ఫ్రెండ్స్ డే గా జరుపుకోవాలని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ నిర్ణయించారు. ఫేస్ బుక్ సంస్థను స్థాపించి పన్నెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 4 ఫేస్ బుక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రజలు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారని...మిత్రులతో, ఇష్టమైన వ్యక్తులతో ఫేస్ బుక్ ద్వారా కనెక్టు అవుతున్నారని అన్నారు. ఫిబ్రవరి 4వ తేదీని ఫ్రెండ్స్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని.. ఆ సంతోషం జీవితంలో ఎంతో మార్పు తీసుకువస్తుందని ఫేస్ బుక్ ఖాతాదారులకు ఆయన సూచించారు. కాగా, జనవరి 2014లో ఫేస్ బుక్ మొదటి కోడ్ ను తాను రాసినట్లు జుకర్ బర్గ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News