: చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రులు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఈ ఉదయం తెలంగాణ మంత్రులు ప్రత్యేకంగా కలిశారు. మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ లు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు. కొద్ది సేపటి క్రితం చంద్రబాబు నివాసానికి వెళ్లిన నేతలు సుమారు అరగంట పాటు చర్చించారు. వారిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు లోపలికి తీసుకెళ్లారు. వరంగల్ లో బిల్ట్ ఫ్యాక్టరీ (రేయాన్)ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని చంద్రబాబును టీఎస్ మంత్రులు కోరినట్టు తెలుస్తోంది. కాగా, గత నెల రెండో వారంలో రేయాన్ ఫ్యాక్టరీ ఆర్థిక పునరుద్దరణ కోసం నిధులు కేటాయించడానికి ఒప్పుకున్న కేసీఆర్ సర్కారు తొలి విడతగా రూ. 30 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ తరఫున కూడా కొన్ని నిధులివ్వాలని చంద్రబాబును కడియం శ్రీహరి కోరగా, అందుకు బాబు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News