: ఆఫ్గన్ లోని భారత ఎంబసీ ముందు పేలుడు


ఆఫ్గనిస్థాన్ లోని భారత ఎంబసీపై మరో మారు ఉగ్రవాదులు దాడి చేశారు. ఆఫ్గన్ తూర్పు ప్రాంతంలో ఉన్న జలాలాబాద్ లోని ఇండియన్ కాన్సులేట్ దగ్గర కొద్దిసేపటి క్రితం పేలుడు సంభవించింది. ఈ ప్రాంతంలోనే పాకిస్థాన్, ఇరాన్ కాన్సులేట్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా? నష్టం ఏ మేరకు? అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. గడచిన వారం రోజుల వ్యవధిలో ఆఫ్గన్ లోని రాయభార కార్యాలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వం శాంతిచర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే, తాలిబాన్లు మాత్రం తమదైన ఉగ్ర వైఖరిని వీడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News