: హైదరాబాదులో బీజేపీ, టీడీపీ బహిరంగ సభ వేదికకు చేరుకున్న చంద్రబాబు


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. నేటి మధ్యాహ్నం విశాఖపట్టణంలో సీఐఐ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సభకు హాజరవుతారా? లేదా? అన్న అనుమానం వ్యక్తమయినప్పటికీ, అక్కడి అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని చంద్రబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. మళ్లీ రేపు ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్నారు. ఈ బహిరంగ సభలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయతో పాటు టీడీపీ, బీజేపీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News