: 'నేనే ఫస్టు' అంటున్న అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. బాలీవుడ్ నుంచి దక్షిణాదికి దిగుమతి అయ్యే నటుడిని తానేనని అక్షయ్ చెప్పాడు. రజనీకాంత్ నటిస్తున్న 'రోబో 2' సినిమాలో అక్షయ్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతూ, మంచి సినిమాతో దక్షిణాదికి పరిచయం కావడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇంతవరకు దక్షిణాది సినిమాలు బాలీవుడ్ నటీమణులను మాత్రమే దిగుమతి చేసుకున్నాయని, నటులను దిగుమతి చేసుకోలేదని, తానే అలా దిగుమతి అవుతున్నానని అక్షయ్ చెప్పాడు. తనకు గుజరాతీ, బెంగాలీ, భోజ్ పురీ సినిమాల్లో కూడా నటించాలని ఉందని అక్షయ్ కుమార్ తెలిపాడు. 'రోబో 2' షూటింగ్ ప్రారంభమైనప్పటికీ నెల తరువాతే తన పాత్ర చిత్రీకరణ మొదలవుతుందని, అప్పుడు వెళ్లి యూనిట్ తో జాయిన్ అవుతానని అక్షయ్ కుమార్ చెప్పాడు.