: నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పై 'మా'లో పవన్ కల్యాణ్ ఫిర్యాదు
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ పై ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమా పారితోషికానికి సంబంధించి తనకు రావాల్సిన బ్యాలెన్స్ రూ.2 కోట్ల విషయంలో ఆయన మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'నాన్నకు ప్రేమతో' చిత్రం విడుదల సమయంలో ఆ మొత్తాన్ని ఇస్తానని నిర్మాత చెప్పారని తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన 'మా' అసోసియేషన్ దాన్ని నిర్మాతల మండలికి పంపింది. ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని నిర్మించారు. ఇది రేపు విడుదల అవుతోంది. ఈ సమయంలో పవన్ 'మా'కు ఫిర్యాదు చేయడం సినీ పరిశ్రమలో హాట్ టాపిగ్గా మారింది.