: 334 ఒప్పందాలు, రూ. 4.80 లక్షల కోట్ల పెట్టుబడి, 10.15 లక్షల మందికి ఉపాధి


'సూర్యోదయాంధ్రప్రదేశ్' పేరిట విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు తుది దశకు చేరింది. నేడు చివరి రోజు సమావేశాలు జరుగుతుండగా, చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సహా పలువురు ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులతో సమావేశమై వారు వెల్లడించిన అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, వారిచ్చిన సలహాలను స్వీకరించారు. నిబంధనలు, అనుమతుల విషయంలో మరింత పారదర్శకత ఉండాలని ఇన్వెస్టర్లు ఏపీ సర్కారుకు సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పెట్టుబడులతో వచ్చే వారితో తమ ప్రభుత్వం స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కాగా, ఈ మూడు రోజుల సదస్సులో మొత్తం 334 అవగాహనా ఒప్పందాలు కుదిరాయని, రూ. 4,80,878 కోట్లు పెట్టుబడుల రూపంలో రానున్నాయని మంత్రి గంటా శ్రీనివాస్ వివరించారు. మూడవ రోజు రూ. 91,650 కోట్ల విలువైన ఎంఓయూలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఈ కంపెనీల విస్తరణ ద్వారా 10,15,836 మందికి ప్రత్యక్షంగా మరో 50 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని వివరించారు. పర్యాటక రంగంలో 26 డీల్స్ కుదిరాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News