: రోహిత్ దెబ్బకు విరిగిన బ్యాట్... ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆట 50వ ఓవర్లో బొలాండో వేసిన బంతిని తన కండబలం చూపుతూ రోహిత్ సిక్స్ బాదగా, అతని బ్యాట్ విరిగింది. దీంతో మరో బ్యాటుతో తన ఆటను కొనసాగించాడు. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత రీతిలో రాణించి చేసిన 171 పరుగులకు కోహ్లీ స్ఫూర్తిదాయక 91 పరుగులు, భారత్ భారీ స్కోరు సాధించేందుకు సహకరించాయి. ధవన్ 9, కెప్టెన్ ధోనీ 18, జడేజా 10 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్ వుడ్ 1, ఫాల్కనర్ 2 వికెట్లు తీశారు. మరి కొద్దిసేపట్లో 310 పరుగుల విజయ లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది.