: మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్న రుపర్ట్ మర్డోక్


మీడియా మొఘల్ రుపర్ట్ మర్డోక్ మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ మోడల్, మాజీ నటి జెర్రీ హాల్(59)ను ఆయన పెళ్లాడబోతున్నారు. ప్రస్తుతం మర్డోక్ వయసు 84 ఏళ్లు. ఆయనకిది నాలుగవ వివాహం. గత వేసవిలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఇప్పుడు పెళ్లికి దారితీస్తోంది. తాజాగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందర్భంగా ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయాన్ని వెల్లడించారు. త్వరలో వివాహం చేసుకోబోతున్నామని చెప్పారు. రెండేళ్ల కిందట మూడో భార్య వెండీ డెంగ్ తో మర్డోక్ విడాకులు తీసుకున్నారు. ఇక అమెరికా అందగత్తె అయిన హాల్ కూడా 23 ఏళ్ల పాటు సింగర్ సర్ మిక్ తో వివాహ బంధాన్ని కొనసాగించి 1999లో విడాకులు తీసుకుంది.

  • Loading...

More Telugu News