: రెండోరోజు ఎన్ఐఏ విచారణకు హాజరైన ఎస్పీ సల్విందర్ సింగ్
పంజాబ్ ఎస్పీ సల్విందర్ సింగ్ రెండో రోజు ఢిల్లీలో ఎన్ఐఏ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇవాళ కూడా పలు కీలక అంశాలపై విచారణ చేయనున్నారు. కాగా నిన్న (సోమవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటల పాటు సల్విందర్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఆయనకు లైడిటిక్టర్ పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆయనతో పాటు వంటమనిషి మదన్ గోపాల్ ను కూడా ఢిల్లీకి రప్పించి విచారించే అవకాశం ఉంది. ఈ మేరకు అతనికి ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. ఈ నెల 13 తమ కార్యాలయానికి రావాలని అందులో తెలిపింది.