: అనంతపురం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ప్రభుదాస్ మృతి
అనంతపురం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ప్రభుదాస్ చనిపోయారు. రెండురోజులుగా జిల్లాలోని సర్వజన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ గుండెపోటు రావడంతో మరణించారు. ప్రభుదాస్ మృతికి మంత్రి పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీకాంతం, ఖాజామోదీన్ లు సంతాపం తెలిపారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అని అధికారులు చెప్పారు.