: భారత్ తో దోస్తీ కటీఫ్... మోదీపై విమర్శలు గుప్పించిన ముషారఫ్


పాకిస్తాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ భారత్ పై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఆయన సమక్షంలో భారత్ తో చెలిమికి ఆస్కారమే లేదన్నారు. ప్రధాని మోదీ ముస్లింలు, పాకిస్తాన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూ వారిని ప్రపంచానికి శత్రువులుగా చూపిస్తున్నారన్నారు. పాకిస్తాన్ లోని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్.. తాము భారత్ ను కాంగ్రెస్, బీజేపీలు పాలిస్తున్న సమయం నుంచి గమనిస్తున్నామని, అప్పట్లో భారత్ లో ఇటువంటి వైఖరి కనిపించలేదన్నారు. ప్రస్తుతం భారత్ లో వినిపిస్తున్న వాదన పార్టీకి సంబంధించినది కాదని, అది కేవలం వ్యక్తిగతమైనదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News