: పాకిస్తాన్ పర్యాటకులకు వీసా నో... భారత్
పాకిస్తాన్ నుండి భారత్ రావాలనుకుంటున్న 75 మంది పాకిస్తాన్ పర్యాటకులకు వీసా ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. వీరంతా భారత్ లోని ఆగ్రా సమీపానగల హజరత్ హాఫిజ్ అబ్దుల్లా షా దర్గాలో జరిగే వార్షికోత్సవానికి హాజరు కావాలని భావించారు. జనవరి 11 నుంచి 18 వరకూ జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకున్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ కొన్ని కారణాలతో వారికి వీసాలు ఇచ్చేందుకు సుముఖంగా లేమని అన్నారు. ప్రోటోకాల్ ను అనుసరించి వీరు ఈ కార్యక్రమానికి హాజరుకావాలనుకుంటున్నారని, అయితే ఈ కార్యక్రమం జరిగే ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేనందున కూడా వారికి వీసాలు ఇవ్వలేమని తెలిపారు.