: కెప్టెన్ కూల్ ‘లుంగీ’ డ్యాన్స్!... టీవీఎస్ యాడ్ లో ప్రభుదేవాతో కలిసి స్టెప్పులు


హెలికాప్టర్ షాట్లతో క్రికెట్ మైదానంలో వీర విహారం చేసే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... సరికొత్తగా ‘లుంగీ’ కట్టాడు. అంతేకాదు, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాతో కలిసి స్టెప్పులేసి మరీ సందడి చేశాడు. ఇదేదో సినిమాలో కాదులెండి, ఓ వాణిజ్య ప్రకటనలో! టీమిండియా వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న మహీ చాలా కాలం నుంచి ప్రముఖ మోటార్ బైకుల సంస్థ ‘టీవీఎస్’కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. దక్షిణాదిలో వేడుకగా జరుగుతున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ ఓ సరికొత్త వీడియో యాడ్ ను రూపొందించింది. సదరు వీడియోలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్న మహేంద్రుడు... అచ్చం దక్షిణాది యువకుడిగా కనిపిస్తున్నాడు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసి, మణికట్టుపైకి చేతులు మడిచి.. తెల్లటి లుంగీలో కనిపిస్తాడు. తన డ్యాన్స్ బ్యాచ్ తో అప్పటికే అక్కడ ఉన్న ప్రభుదేవా పిలుపుతో లుంగీని ఒక్క ఉదుటన మోకాళ్ల పైకి కట్టేసిన ధోనీ... సినీ హీరోలా నడుము ఊపుతూ స్టెప్పులేశాడు. అంతేనా, అక్కడే పార్క్ చేసిన టీవీఎస్ బైకుపై యాంగ్రీ పోలీస్ ఆపీసర్ లా ముందు నుంచి కాలును ఎత్తి ఎక్కి కూర్చుంటాడు. ఇక అతడితో స్టెప్పులేయించిన ప్రభుదేవా బైకును వెనుక నుంచి జంప్ చేసి ధోనీతో రైడ్ కు వెళతాడు. 20 సెకన్ల వ్యవధి ఉన్న ఈ యాడ్ దక్షిణాది టీవీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకోనుంది.

  • Loading...

More Telugu News