: చంద్రన్న రాజ్యంలో ప్రతి ఇంటా దౌర్భాగ్యం: ఎమ్మెల్యే రోజా


'రాజన్న రాజ్యంలో ప్రతి ఇంటా సౌభాగ్యం.. చంద్రన్న రాజ్యంలో ప్రతి ఇంటా దౌర్భాగ్యం' ఉందని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రోజా ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాంకేతికంగా సీఎం చంద్రబాబే అయినా, నైతికంగా జగనే ముఖ్యమంత్రి అని అన్నారు. మంత్రి పీతల సుజాతకు డబ్బు సంచులు, వడ్డాణంపై ఉన్న మోజు నియోజకవర్గ అభివృద్ధిపై లేదని ఆరోపించారు. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించడం లేదని, మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. టీడీపీకి అండగా పవన్ కల్యాణ్ లేకపోయి వుంటే కనుక అధికారం వైఎస్సార్సీపీదేనని రోజా అన్నారు.

  • Loading...

More Telugu News