: మళ్లీ చైనా ప్రభావం... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ పై మళ్లీ చైనా మార్కెట్ల ప్రభావం పడింది. చైనా బ్లాక్ మండేని నమోదు చేసుకోవడంతో... బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 24,825 వద్ద ముగిసింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 7,564 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో వేదాంత షేర్లు 4.87 శాతం లాభపడి రూ.85 వద్ద ముగిశాయి. వాటితో పాటు రిలయన్స్, టాటా మోటార్స్, గ్రాసిమ్, మారుతీ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అటు విప్రో సంస్థ షేర్లు అత్యధికంగా 3.45 నష్ట నష్టపడగా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టెక్ మహాంద్రా, డాక్టర్ రెడ్డీస్ సంస్థల షేర్లు కూడా నష్టాలు మూటగట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.76 వద్ద కొనసాగుతోంది.