: బన్సల్ ద్వయం స్థానాలు మార్చుకున్నారు!...ఫ్లిప్ కార్ట్ సీఈఓగా బిన్నీ


దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ సారథ్య బాధ్యతలు దాని వ్యవస్థాపక మిత్ర ద్వయంలో ఒకరి నుంచి మరొకరికి మారిపోయాయి. మొన్నటిదాకా సచిన్ బన్సల్ సంస్థ సీఈఓగా వ్యవహరించగా, అతడి మిత్రుడు బిన్నీ బన్సల్ తెర వెనుకే కార్యకలాపాలు నడిపారు. తాజాగా నేటి ఉదయం మిత్రులిద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిన్నీకి సీఈఓ పోస్టును అప్పగించిన సచిన్ బన్సల్, ఇకపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం ‘ఫ్లిప్ కార్ట్’ కీలక ప్రకటన విడుదల చేసింది. నిన్నటిదాకా సచిన్ బన్సల్ అంతా తానై వ్యవహరిస్తే, తెర వెనుకే ఉన్న బిన్నీ బన్సల్ సంస్థ వ్యూహరచనలో తలమునకలయ్యారు. తాజా మార్పులతో సచిన్ అండర్ గ్రౌండ్ వ్యూహరచనకు సిద్ధమవగా, బిన్నీ జనంలోకి రానున్నారు.

  • Loading...

More Telugu News