: ఇండిగో విమానంలో మహిళపై లైంగిక వేధింపులు


ఇండిగో విమానంలో మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో విమానం సిద్ధమైంది. సిబ్బంది సూచనతో సీటు బెల్టు పెట్టుకున్న వెంటనే ఓ మహిళ ఉన్నట్టుండి గట్టిగా అరిచింది. దీంతో బయల్దేరాల్సిన విమానాన్ని ఆపేసిన సిబ్బంది, వెళ్లి చూడగా, పక్క సీట్లో ఉన్న సంజయ్ కనద్ (50) తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెప్పింది. దీంతో వారిద్దరినీ కోల్ కతా విమానాశ్రయంలో దించేసిన తర్వాత ఆ విమానం బయల్దేరింది. దీనిపై విచారించిన అధికారులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సంజయ్ ను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News