: ఢిల్లీలో వాయు కాలుష్యం 50 శాతం వరకు తగ్గింది: కేజ్రీవాల్


దేశ రాజధాని న్యూఢిల్లీలో 'సరి-బేసి' వాహన విధానాన్ని అమలు చేయడం ప్రారంభించిన తరువాత కాలుష్యంపై అధికారిక లెక్కలను కేజ్రీవాల్ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. గడచిన 10 రోజుల్లో ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పొల్యూషన్ టెస్టింగ్ యంత్రాల గణాంకాలను కేజ్రీ విడుదల చేశారు. "వాయు కాలుష్యం 50 శాతం వరకూ తగ్గినట్టు మేము సేకరించిన సమాచారం వెల్లడిస్తోంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ సిబ్బంది ఈ గణాంకాలను సేకరించారు" అని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో కేజ్రీ వివరించారు. కాగా, సైంటిస్టులు మాత్రం వాతావరణ పరిస్థితుల కారణంగానే కాలుష్యం తగ్గిందని చెబుతుండటం గమనార్హం. 9 ప్రాంతాల నుంచి సేకరించిన కాలుష్యపు గణాంకాల్లో, ఘనపు మీటర్ విస్తీర్ణంలో 100 మైక్రోగ్రాముల కన్నా తక్కువ కాలుష్యం నమోదైంది. ఓ ప్రాంతంలో అతి తక్కువగా 59 మైక్రోగ్రాముల కాలుష్యం నమోదు కాగా, అత్యధికంగా 301 మైక్రోగ్రాముల కాలుష్యం నమోదైంది.

  • Loading...

More Telugu News