: ప్రేమ జంటపై టీఆర్ఎస్ నేత అఘాయిత్యం!
వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత ఒకరు, ప్రేమ జంటను అటకాయించి, ఆపై యువతిపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లా పరిధిలోని శాయంపేటలో జరిగింది. సదరు నేత తమను అడ్డుకుని బెదిరించాడని, ఆపై తన ప్రియురాలిపై అత్యాచారం చేశాడని, తన నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, నిత్యమూ వేధిస్తున్నాడని ప్రియుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతుండగా, ఆ నేత పై స్థాయిలో ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.