: చింతలపూడిలో రోజాను అడ్డుకున్న తెలుగుదేశం కార్యకర్తలు
ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైకాపా ఎమ్మెల్యే రోజా తలపెట్టిన పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా మండల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆమె రాగా, ఓ దళిత మంత్రిని అవమానపరిచేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం కార్యకర్తలు ధర్నాకు దిగారు. చింతలపూడిలోకి రోజాను అనుమతించేది లేదని రాస్తారోకో చేశారు. "రోజా గోబ్యాక్" అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో వైకాపా శ్రేణులు సైతం వీధుల్లోకి వచ్చి దేశం కార్యకర్తలతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలనూ చెదరగొట్టాల్సి వచ్చింది.