: దుబ్బాకలో తాను చదువుకున్న పాఠశాలలో నూతన భవనానికి కేసీఆర్ శంకుస్థాపన
మెదక్ జిల్లా దుబ్బాకలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయింది. పర్యటనలో భాగంగా దుబ్బాకలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని నూతన భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. అరకొర వసతులున్న ఇదే పాఠశాలలో ఒకనాడు కేసీఆర్ విద్యాభ్యాసం చేశారు. ఇవాళ సీఎం హోదాలో తాను చదువుకున్న పాఠశాలకు వచ్చి శంకుస్థాపన చేయడం విశేషం. తాను అష్టకష్టాలు పడి విద్యను పూర్తి చేశానని, తనకొచ్చిన బాధలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రావొద్దన్న ఉద్దేశంతోనే ఈ పాఠశాలలో కొత్త భవనానికి రూ.4.67 కోట్లను మంజూరు చేస్తున్నట్టు గతంలో కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.