: ఆదిలోనే రూ. లక్ష కోట్లు హాంఫట్!


ఆర్థిక నిపుణులు ఊహించినట్టుగానే ఆసియా మార్కెట్ల ప్రభావం సెన్సెక్స్, నిఫ్టీలపై పడింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభం కాగానే, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ గతవారం ముగింపుతో పోలిస్తే, రూ. లక్ష కోట్లకు పైగా కోల్పోయింది. గత వారంలో రూ. 97.56 లక్షల కోట్ల వద్ద ఉన్న మార్కెట్ కాప్, నేటి ఉదయం 9:30 గంటల సమయంలో రూ. 96.53 లక్షల కోట్లకు దిగజారింది. బొంబాయి స్టాక్ మార్కెట్ సూచిక సెన్సెక్స్ 267.51 పాయింట్లు పడిపోయి 1.07 శాతం నష్టంతో 24,666.84 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 87.20 పాయింట్లు పడిపోయి 1.15 శాతం నష్టంతో 7,514 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50లో ఇన్ఫోసిస్ మాత్రమే లాభాల్లో నడుస్తుండగా, మిగతా 49 కంపెనీలూ నష్టాల్లో సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News