: సింహానికి కొమ్ములు... బయాలజిస్టులకు సవాలు!
మరో జీవ సంబంధ రహస్యాన్ని తేల్చాల్సిన బాధ్యత సైంటిస్టులపై పడింది. అమెరికాలో ఓ శునకాన్ని వేటాడిన పర్వత సింహం చిత్రాలను తీసిన వారు, దాని నుదుటిపై కొమ్ముల రూపంలో పళ్లు ఉండటం చూసి అవాక్కయ్యారు. ఇక ఆ సింహం చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం అయికూర్చుంది. ఈ సింహం ఊళ్లల్లోకి వస్తుండటంతో, దాన్ని కాల్చి చంపిన అధికారులు, బయాలజిస్టులకు సింహం శరీరాన్ని అందించగా, నుదుటిపై పళ్లు ఎందుకు వచ్చాయన్న విషయాన్ని శోధించే పనిలో పడ్డారు. వీటిని కొమ్ములుగా భావించాలా? లేదా, శరీర జన్యు లోపాల కారణంగా వచ్చిన దంతాలుగా భావించాలా? అన్న విషయం కూడా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇటువంటి ఘటనను మాత్రం తొలిసారిగా చూస్తున్నామని శాస్త్రవేత్తలు అంటున్నారు.