: కోహ్లీకి చక్కని అవకాశం...డివిలియర్స్ ను దాటగలడా?
టీమిండియా టెస్టు కెప్టెన్ ముందు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో బంగారంలాంటి అవకాశం నిలుచుంది. వన్డే ర్యాంకింగ్స్ లో వరల్డ్ నెంబర్ టూ గా ఉన్న విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో రాణిస్తే వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో సఫారీలకు సిరీస్ లు లేకపోవడంతో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న డివిలియర్స్ మరిన్ని పాయింట్లు పెంచుకునే అవకాశం లేదు. అదే సమయంలో కోహ్లీకి ఆస్ట్రేలియా పర్యటన రూపంలో బంగారం లాంటి అవకాశం లభించింది. ఇదే సమయంలో దోనీ, ధావన్ లకు కూడా ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకునే అవకాశం దక్కింది. ధోనీ 6వ ర్యాంకులో ఉండగా, ధావన్ 7వ ర్యాంకులో ఉన్నారు. అలాగే వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్ లో పదవ ర్యాంకులో ఉన్న అశ్విన్ ర్యాంకు మెరుగుపరుచుకునేందుకు కూడా ఇది మంచి అవకాశమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.