: అతిరథ మహారథుల సాక్షిగా విశాఖలో సీఐఐ సదస్సు
ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఏపీ-సీఐఐ సంయుక్తంగా విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం వివరించనుంది. సదస్సును ఆరుణ్ జైట్లీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాటిని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా వీక్షించారు.