: ఢిల్లీలో దారుణం...ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య


దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓల్డ్ రాజేంద్రనగర్ లోని ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, తల్లి, తండ్రి, కుమారుడ్ని అంతమొందించిన దుండగుల కోసం దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే... నేటి ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన పనిమనిషి ఇంట్లోకి వెళ్లగా, ఇంటి యజమాని భార్య జ్యోతి, కుమారుడు పవన్ విగత జీవులై కనిపించారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సాక్ష్యాల సేకరణలో భాగంగా కప్ బోర్డ్ తలుపులు తెరవగా అందులో ఇంటి యజమాని సంజీవ్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఆస్తి కోసం బంధువులెవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News