: సూసైడ్ చేసుకుంటానని కూకట్ పల్లిలో యువకుడి హల్ చల్... కవరేజీకి వెళ్లిన మీడియాపై దాడి


హైదరాబాదులోని కూకట్ పల్లి పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్ మెంట్ వద్ద కలకలం రేగింది. అక్కడ జరిగిన వరుస ఘటనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. కాంట్రాక్టర్ డబ్బులు తిరిగివ్వడం లేదని ఆరోపిస్తూ ఓ యువకుడు అపార్ట్ మెంట్ లోని 18వ అంతస్తు నుంచి దూకేస్తానని బెదిరించాడు. అంతేకాక ఏకంగా అపార్ట్ మెంట్ పైకి ఎక్కేశాడు. తనను వేధిస్తున్న కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో యువకుడి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజీకి అక్కడికి పరుగులు పెట్టారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కెమెరాలను చూసిన అపార్ట్ మెంట్ వాసులు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

  • Loading...

More Telugu News