: కర్నూలు చర్చిలో సైకో కలకలం... వైద్యురాలిపై సుత్తితో దాడి చేసిన సైకో
రాయలసీమ ముఖద్వారం కర్నూలు నగరంలో కొద్దిసేపటి క్రితం ఓ సైకో హల్ చల్ చేశాడు. ఆదివారం కావడంతో క్రైస్తవులంతా చర్చిలకు వెళతారు. దీనినే అవకాశంగా మలచుకున్న ప్రదీప్ అనే సైకో నగరంలోని సీఎస్ఐ చర్చిలో దారుణానికి ఒడిగట్టాడు. ప్రార్థనల కోసం చర్చికి వచ్చిన వైద్యురాలు హిమబిందుపై అతడు సుత్తితో దాడి చేశాడు. చర్చిలోని ఇతర భక్తులు తేరుకునేలోగానే అతడు వైద్యురాలిపై విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో హిమబిందుకు తీవ్ర గాయాలయ్యాయి. కాస్తంత ఆలస్యంగానైనా స్పందించిన అక్కడి వారు ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సైకో దాడితో చర్చిలోనే రక్తపు గాయాలైన హిమబిందును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా సైకో విరుచుకుపడటంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.