: కొత్త ఆవిష్కరణ... వైన్ మెషీన్!


ఫ్రాన్స్ కు చెందిన 10-విన్స్ అనే స్టార్టప్ కంపెనీ ‘డీ-వైన్’ పేరుతో వైన్ మెషీన్ ని తయారు చేసింది. అమెరికాలో జరుగుతున్న లాస్ వెగాస్ టెక్నాలజీ షోలో ఈ మెషీన్ ని ప్రదర్శించారు. వైన్ రుచి మారకుండా, కావాల్సిన ఉష్ణోగ్రతతో దీనిని రెడీ చేసుకునే విధంగా ఈ మెషీన్ ని తయారు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మెషీన్ లో పెట్టడానికి వీలుగా ఉండే 10 సెంటీలీటర్ క్యాప్సుల్స్ కూడా ఉన్నాయి. వీటిని మెషీన్ పైభాగంలో పెడితే అది వైన్ ను మెషీన్ లోకి పంపి మనకు అవసరమైన ఉష్ణోగ్రతతో వైన్ సిద్ధమవుతుంది.

  • Loading...

More Telugu News