: రామమందిర నిర్మాణంపై సెమినార్... ఢిల్లీ వర్సిటీలో ఆందోళన


ఢిల్లీ యూనివర్సిటీలో ఇవాళ నిర్వహించిన రామమందిర నిర్మాణంపై సెమినార్ ను కొన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రారంభించిన ఈ సెమినార్ లో ఆయన మాట్లాడుతుండగా ఆందోళన చేశారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ యూఐ) విద్యార్థులు, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు వర్శిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనను ఏబీవీపీ నేతలు అడ్డుకున్నారు. కాన్ఫరెన్స్ సెంటర్ ఎదురుగా గుమిగూడి 'జై శ్రీరాం', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రతరం కావడంతో పోలీసులు మోహరించి వారిని చెదరగొట్టారు.

  • Loading...

More Telugu News