: అఫ్జల్ ఉరిశిక్షపై కుటుంబానికి అందని సమాచారం!


పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తమకు ముందుగా తెలియజేయలేదని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు సమాచారం ఇచ్చామన్న ప్రభుత్వ ప్రకటనలు సత్యదూరమని వారు అంటున్నారు. అఫ్జల్ ఉరి గురించి టీవీలో చూసి తెలుసుకున్నామని ముందుగా తెలిసి ఉంటే ఒక్కసారైనా చూసేందుకు వెళ్లి ఉండేవాళ్లమని శ్రీనగర్ లోని సోపోర్ లో ఉన్న అతని బంధువు యాసీన్ గురు అనన్నారు.

ప్రభుత్వం సమాచారం అందించి ఉంటే కనీసం అతని చివరి కోర్కె తీర్చే అవకాశం ఉండేదని వారు వ్యాఖ్యానించారు. తమకు లేఖ రాశామన్న ప్రభుత్వం అందుకు రు
జువుగా సంబంధిత పత్రాలను చూపాలని అఫ్జల్ కుటుంబం డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News