: ఈ నెల 15న భారత్-పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ
భారత్-పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శులు ఈ నెల 15న సమావేశం కానున్నారని పాక్ ప్రధాని సలహాదారుడు సర్తజ్ అజీజ్ తెలిపారు. ఆ దేశ పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు సమావేశమై చర్చించనున్నారని ఆయన చెప్పారు. ఈ భేటీలో ఇతర అంశాలతో పాటు కశ్మీర్ అంశాన్ని కూడా వారు చర్చిస్తారని అజీజ్ పేర్కొన్నారు.